IPL 2020 : చెన్నై టార్గెట్ 163

|

Sep 19, 2020 | 10:16 PM

ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది. మస్త్ క్రికెట్ మజా కోసం వెయిట్  చేస్తోన్న క్రికట్ అభిమానులకు..ఆ కిక్ మొదటి ఇన్నింగ్స్ లోనే లభించింది.

IPL 2020 : చెన్నై టార్గెట్ 163
Follow us on

ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది. మస్త్ క్రికెట్ మజా కోసం వెయిట్  చేస్తోన్న  అభిమానులకు..ఆ కిక్ మొదటి ఇన్నింగ్స్ లోనే లభించింది. ఇరు జట్లు పోటాపోటీగా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించాయి.  ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు భారీ షాట్లకు ప్రయత్నించగా, చెన్నై సూపర్ కింగ్  బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్  వేశారు. ముంబై  ఓపెనర్‌‌ డికాక్‌(33), సౌరభ్‌ తివారీ(42) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 రన్స్ చేసింది.

టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12) విఫలమవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఆరంభంలో డికాక్‌ వేగంగా ఆడటంతో 4 ఓవర్ల ముగిసేసరికి 45 రన్స్  చేసింది. ముంబై ఇన్నింగ్స్‌ జోరు పెంచుతోన్న క్రమంలో చెన్నై స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా  ఐదో ఓవర్ లో తన అనుభవాన్ని ప్రదర్శించాడు.‌ నాలుగో బంతికి రోహిత్ ను తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. డీకాక్ కూడా ఆ తర్వాత ఓవర్‌లోనే ఔటయ్యాడు. అనంతరం సూర్యకుమార్‌ (17)తో జోడీ కట్టిన తివారి బాధ్యతాయుతంగా ఆడాడు.  దీంతో 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. అనంతరం ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న హార్దిక్‌ పాండ్య (14), కీరన్‌ పొలార్డ్‌ (18) సైతం చెప్పుకోదగ్గ ప్రదర్శన చెయ్యలేదు. దీంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.  చెన్నై బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. జడేజా, దీపక్‌ చాహర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక సామ్‌కరన్‌, పీయుష్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.