ధోని స్థానాన్ని రాహుల్ భర్తీ చేయగలడా.?

అంతర్జాతీయ క్రికెట్‌లో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారత్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలిబెట్టాడు. స్వదేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా టీమిండియాను ఎదురులేని జట్టుగా తీర్చిదిద్దాడు.

ధోని స్థానాన్ని రాహుల్ భర్తీ చేయగలడా.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 17, 2020 | 5:09 PM

MS Dhoni Retirement: అంతర్జాతీయ క్రికెట్‌లో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారత్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలిబెట్టాడు. స్వదేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా టీమిండియాను ఎదురులేని జట్టుగా తీర్చిదిద్దాడు. ఇదిలా ఉంటే తాజాగా ధోని క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. ఇప్పటి వరకు భారత్ జట్టులో నాలుగో స్థానం పెద్ద సమస్యగా ఉండేది. అయితే ఆ ప్లేస్‌ను శ్రేయాస్ అయ్యర్ భర్తీ చేశాడు.

ఇక ఇప్పుడు ధోని స్థానంలో  టెస్టుల్లో ఇప్పటికే వృద్ధిమాన్ సాహా కీపింగ్ బాధ్యతలు తీసుకుంటుండగా.. వన్డేలు, టీ20ల్లో మాత్రం వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఇద్దరిలో ఫామ్ పరంగా చూసుకుంటే మొదటి ప్రిఫెరెన్స్ రాహుల్‌కే ఇస్తారని చాలామంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై ఎమ్ఎస్కే ప్రసాద్, దీప్ దాస్ గుప్తా స్పందిస్తూ.. వన్డేల్లో రాహుల్‌ని, టీ20ల్లో రిషబ్ పంత్‌ను కొనసాగించాలని అన్నారు. అటు మాజీ కీపర్ నయన్ మోంగియా కూడా ఈ ప్రస్తావనను తీసుకొస్తూ.. వన్డేల్లో రాహుల్‌నే కొనసాగిస్తారని చెప్పుకొచ్చాడు.

Also Read:

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!