లాక్ డౌన్ వేళ.. వైరల్ గా మారిన ధోని న్యూ లుక్..

| Edited By:

May 10, 2020 | 10:18 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే.. లాక్‌డౌన్‌ వేళ క్రికెటర్లందరూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ సామాజిక మాధ్యమాల్లో

లాక్ డౌన్ వేళ.. వైరల్ గా మారిన ధోని న్యూ లుక్..
Follow us on

MS Dhoni: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే.. లాక్‌డౌన్‌ వేళ క్రికెటర్లందరూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ధోని మాత్రం తన కూతురుతో ఆటలాడుతున్నాడు.

కాగా.. ధోని తన కూతురు జివాతో సరదాగా గార్డెన్‌లో ఆడుతూ.. పరుగెత్తుతూ ఉన్న వీడియోను జివా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో ధోనీని చూసిన అభిమానులు షాక్‌ అయ్యారు. అందుక్కారణం అతను తెల్ల గడ్డంతో గుర్తుపట్టలేని విధంగా కనిపించడమే. ఒకప్పటి జులపాల కుర్రాడు.. ఇప్పుడిలా మారిపోయాడేంటంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు, ఆ తర్వాత అంటూ ధోని ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.