హనీట్రాప్ కేసులో కొత్త కోణం.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్..!

| Edited By: Pardhasaradhi Peri

Oct 02, 2019 | 5:23 PM

మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ కేసులో ఊహకందని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకుని కొంతమంది కామ కిలేడీలు రాజకీయ నాయకులను బెదిరిస్తున్నారు. ముందుగా కొందరు నాయకులను ఎంచుకుని.. వారి వద్దకు అమ్మాయిలను పంపించి ట్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న నాయకుల వీడియోలు తీసి గేమ్ మొదలు పెడుతున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు రావడంతో నాయకులు ఒకరి పై ఒకరు బురద చల్లుకుంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని వారి వద్ద […]

హనీట్రాప్ కేసులో కొత్త కోణం.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్..!
Follow us on

మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ కేసులో ఊహకందని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకుని కొంతమంది కామ కిలేడీలు రాజకీయ నాయకులను బెదిరిస్తున్నారు. ముందుగా కొందరు నాయకులను ఎంచుకుని.. వారి వద్దకు అమ్మాయిలను పంపించి ట్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న నాయకుల వీడియోలు తీసి గేమ్ మొదలు పెడుతున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు రావడంతో నాయకులు ఒకరి పై ఒకరు బురద చల్లుకుంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని వారి వద్ద ఉన్న రాజకీయ నాయకుల వీడియోలను అమ్మకానికి పెట్టారు.

తమకు రూ.30 కోట్లు ఇస్తే వాటిని ఇచ్చేస్తామని రాజకీయ పార్టీలు, నాయకులకు ఆఫర్‌ ఇచ్చారు. దశలవారీగా చర్చలు కూడా జరిపారు. దీంతో తనకు కొన్ని వీడియలు కావాలని ఓ రాజకీయ నాయకుడు ముందుకొచ్చాడు. అందుకు రూ.6 కోట్లు ఇస్తానని ఆఫర్‌ ఇచ్చాడు. కానీ, విడివిడిగా ఇచ్చేది లేదని, మొత్తం అన్ని వీడియోలూ తీసుకోవాలని, రూ.30 కోట్లకు తక్కువైతే కుదరదని కిలేడీలు తేల్చిచెప్పారు. అంత మొత్తం డబ్బు పెట్టడానికి ఎవరూ రాకపోవడంతో, రాజకీయ నాయకులకు విడివిడిగా వాటిని అమ్మేశారు.

ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పార్టీల్లోని కిలేడీల సంబంధాలపై ప్రభావం చూపిందని, ఇదే అవకాశం అన్నట్లుగా వీలైనంత దండుకోవాలని ఆ ప్రయత్నంలో కిలేడీలు పట్టుబడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, వలపు వల, బ్లాక్‌ మెయిలింగ్‌ కేసులో మధ్యప్రదేశ్‌ కోర్టు ఐదుగురు మహిళలకు జ్యుడీషియల్‌ కస్టడీని 14 వరకూ పొడిగించింది. కాగా, విచారణ సందర్భంగా పోలీసులు తన క్లయింట్‌ శ్వేతా విజయ్‌ జైన్‌ను దారుణంగా వేధించారని, కొట్టారని ఆమె న్యాయవాది ధర్మేంద్ర గుర్జార్‌ తెలిపారు. అయితే, ఆయన ఆరోపణలను పోలీసులు ఖండించారు. అయితే ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారా..? ఈ కేసులో విచారణ జరిపితే ఎంతో మంది పెద్ద పెద్ద నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని.. గుట్టుగా ఉంచితే మంచిదని సీఎం కమల్ నాథ్‌‌కు ఆయన సలహాదారులు సూచించినట్లు సమాచారం.