దుబాయ్ లో సీఎం రమేష్ ‘పెళ్లి రాజకీయాలు’!

| Edited By:

Nov 24, 2019 | 1:34 PM

ఏపీలో టచ్ పాలిటిక్స్ హై పీక్స్ లోకి వెళుతున్నాయి. వైసీపీ, టీడీపీ టార్గెట్ గా ‘ఆకర్ష్’ సమరం నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఎంపీలు,  సీనియర్స్ సాఫ్రన్ కి  దగ్గరవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న కీలక పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లోనూ, రాష్ట్రంలోనూ కొందరు నేతలు బీజేపీతో టచ్ లోకి వస్తున్నారన్న ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. రెండు పార్టీల సీనియర్స్ కి గాలం వేసే విధంగా స్కెచ్ నడుస్తోంది. త్వరలోనే ఏపీ లోని ప్రధాన […]

దుబాయ్ లో సీఎం రమేష్ పెళ్లి రాజకీయాలు!
Follow us on

ఏపీలో టచ్ పాలిటిక్స్ హై పీక్స్ లోకి వెళుతున్నాయి. వైసీపీ, టీడీపీ టార్గెట్ గా ‘ఆకర్ష్’ సమరం నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఎంపీలు,  సీనియర్స్ సాఫ్రన్ కి  దగ్గరవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న కీలక పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లోనూ, రాష్ట్రంలోనూ కొందరు నేతలు బీజేపీతో టచ్ లోకి వస్తున్నారన్న ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. రెండు పార్టీల సీనియర్స్ కి గాలం వేసే విధంగా స్కెచ్ నడుస్తోంది. త్వరలోనే ఏపీ లోని ప్రధాన పార్టీలకు గట్టి షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీలు ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ లో కూడా త్వరలోనే భారీ చీలిక జరిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో చాలామంది బీజేపీతో బేరసారాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికంతటికి సిఎం రమేష్ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ ఎంపీ సిఎం రమేష్ ఒక పారిశ్రామికవేత్త, ఇది అందరికీ తెలిసిన విషయమే. అతని కుమారుడి నిశ్చితార్థం ఈ రోజు దుబాయ్‌లో జరుగుతోంది. ఎంగేజ్‌మెంట్ వేడుకకు చాలా మంది రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు వస్తారని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఎంపీ రమేష్ తన ప్రత్యేక ఆహ్వానితుల కోసం 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన 75 మంది ఎంపీలు హాజరవుతారని చెబుతున్నారు. నిశ్చితార్థానికి వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఎంపి సిఎం రమేష్ కుమారుడు రిత్విక్ కు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రాజా తాలూర్ కుమార్తె పూజతో నిశ్చితార్థం జరగనుంది. ఈ జంటను ఆశీర్వదించడానికి ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు దుబాయ్ చేరుకున్నారు.