సంక్రాంతి బరిలో అక్కినేని యంగ్ హీరో.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎప్పుడొస్తున్నాడంటే.

| Edited By: Pardhasaradhi Peri

Dec 21, 2020 | 7:27 PM

టాలీవుడ్‌కు సెంటిమెంట్‌గా భావించే సంక్రాంతి కానుకంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. క్రాక్, రంగ్‌దే, మాస్టర్, అరణ్య వంటి చిత్రాలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇక సంక్రాంతి రేసులో మరో యంగ్ హీరో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో అక్కినేని యంగ్ హీరో.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎప్పుడొస్తున్నాడంటే.
Follow us on

most eligible bachelor release date: కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. థియేటర్లు మూతపడడం, సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో మౌనం రాజ్యమేలింది. అయితే కేంద్రం అన్‌లాక్‌లో భాగంగా ఇస్తోన్న సడలింపులతో ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఇక థియేటర్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చని నిర్ణయించడంతో మళ్లీ సినిమాల సందడి మొదలు కానుంది. ఈ నెల 25 నుంచి కొత్త సినిమాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
ఇదిలా టాలీవుడ్‌కు సెంటిమెంట్‌గా భావించే సంక్రాంతి కానుకంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. క్రాక్, రంగ్‌దే, మాస్టర్, అరణ్య వంటి చిత్రాలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇక సంక్రాంతి రేసులో మరో యంగ్ హీరో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.