భారీ వర్షాలు.. కొచ్చి ఎయిర్‌పోర్ట్ మూసివేత

| Edited By:

Aug 09, 2019 | 12:41 PM

కేరళలో వరుణుడి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తాజాగా పెరియార్ నదిపై ఉన్న ఆనకట్టలో వరద ఉద్ధృతి పెరగడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. రన్‌వేపైకి నీరు రావడంతో ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు విమానాశ్రయంలో సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కొచ్చికి రావాల్సిన, అక్కడి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసేకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునే విషయంపై […]

భారీ వర్షాలు.. కొచ్చి ఎయిర్‌పోర్ట్ మూసివేత
Follow us on

కేరళలో వరుణుడి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తాజాగా పెరియార్ నదిపై ఉన్న ఆనకట్టలో వరద ఉద్ధృతి పెరగడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. రన్‌వేపైకి నీరు రావడంతో ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల వరకు విమానాశ్రయంలో సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కొచ్చికి రావాల్సిన, అక్కడి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసేకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

కాగా కేరళలో కొచ్చితో పాటు వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కొజిక్కోడ్ జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షాలతో ఇప్పటివరకు కేరళలో 20మంది మృతి చెందారు. 13వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారు.