అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

| Edited By:

Sep 05, 2019 | 9:04 AM

మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 24గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45-50కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని.. మత్స్యకారులు వేటకు […]

అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
Follow us on

మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 24గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 45-50కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వారు హెచ్చరించారు. ఇక ఇటు తెలంగాణాలో ఉత్తర, తూర్పు జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.