తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

| Edited By: Anil kumar poka

Jul 20, 2019 | 2:24 PM

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ, గుజరాత్, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వారు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని దీని వలన తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కొంకణ్, గోవా, కర్ణాటక, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులు, మరాఠ్వాడ, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
Follow us on

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ, గుజరాత్, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వారు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని దీని వలన తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కొంకణ్, గోవా, కర్ణాటక, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులు, మరాఠ్వాడ, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. వచ్చే కొన్ని రోజుల పాటు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.