సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి వాకబు చేసిన మోహన్ బాబు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.

రజినీ ఆరోగ్యం విషయమైన ఆయన స్నేహితుడు నటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్ బాబు రజినీ ఆరోగ్య విషయమై ఫోన్‌లో ఆరా తీశారు...

సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి వాకబు చేసిన మోహన్ బాబు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.

Updated on: Dec 26, 2020 | 10:58 AM

Mohan reacts on rajini health condition: హైదరాబాద్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నటుడు రజినీకాంత్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఒకేసారి రక్తపోటు తీవ్రం కావడంతో ఆయన్ని జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే తాజాగా రజినీ ఆరోగ్యం విషయమైన ఆయన స్నేహితుడు నటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్ బాబు రజినీ ఆరోగ్య విషయమై ఫోన్‌లో ఆరా తీశారు. రజినీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య వివరాలను అడిగితెలుసుకున్నారు. రజినీ భార్య, కూతురితో మాట్లాడిన మోహన్ బాబు ఆయన మోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రజినీకాంత్ మానసికంగా దృఢ‌మైన వ్యక్తి అనీ, ఈ అస్వస్థత నుంచి ఆయ‌న త్వరగా కోలుకుని, ఎప్పటిలా త‌న ప‌నులు మొద‌లుపెడ‌తార‌నీ మోహ‌న్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మోహన్ బాబు, రజినీకాంత్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.

Follow Us