ఆ కోచ్‌ల తప్పుడు ప్రచారం వల్లే రిటైర్మెంట్ ప్రకటించా.. సంచలన నిజాలు బయటపెట్టిన క్రికెటర్..

|

Dec 21, 2020 | 5:45 AM

గత మూడు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్థాన్ పేస్‌బౌలర్ మహ్మద్ అమిర్ కోచ్‌

ఆ కోచ్‌ల తప్పుడు ప్రచారం వల్లే రిటైర్మెంట్ ప్రకటించా.. సంచలన నిజాలు బయటపెట్టిన క్రికెటర్..
Follow us on

గత మూడు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్థాన్ పేస్‌బౌలర్ మహ్మద్ అమిర్ కోచ్‌ మిస్బాఉల్ హక్, వకార్ యూనిస్‌లపై తన అసంత‌ృప్తిని ప్రకటించాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి పాకిస్తాన్ జట్టు యాజమాన్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో సంచలన విషయాలు వెల్లడించాడు.

తను టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించడం లేదని కేవలం డబ్బు కోసమే టీ20 లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడని కోచ్‌లు మిస్బాఉల్ హక్, వకార్ యూనిస్‌లు తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. జట్టులో ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్న తనను న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదని తన గోడును వెళ్లగక్కాడు. తాను నిజంగా టీ20 లీగ్ మ్యాచ్‌లపై ఆసక్తి చూపెడితే నిజంగా ఒప్పుకునేవాడినని ప్రకటించాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోపిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచానని అంతేకాకుండా ఇప్పటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్నానని తెలిపాడు. మిస్బా, యూనిస్‌తో తనకు వివాదాలు ఉన్నాయని అందుకే ప్రజలకు అసలు నిజాలు తెలియజేయాలని బయటికివచ్చానని చెప్పుకొచ్చాడు.