మోదీ ప్రమాణస్వీకారానికి వివిధ దేశాల అధినేతలు!

| Edited By:

May 25, 2019 | 7:54 PM

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. మే 30న మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. అయితే ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. భారత్‌ పొరుగున్న ఉన్న దేశాల అధినేతలతో పాటు, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశాలున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, అబుదబీ యువరాజు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ […]

మోదీ ప్రమాణస్వీకారానికి వివిధ దేశాల అధినేతలు!
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. మే 30న మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. అయితే ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

భారత్‌ పొరుగున్న ఉన్న దేశాల అధినేతలతో పాటు, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల అధ్యక్షులను ఆహ్వానించే అవకాశాలున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, అబుదబీ యువరాజు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతాన్యాహుతో ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. వీరిని కూడా ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి పీ-5 దేశాల అధినేతలను ఆహ్వానిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నారు.