భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ జాబితాలో రాజాసింగ్ పేరు చేర్చారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల తీరుపై రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.
నేను ఇప్పటికీ తెలంగాణ పోలీసుల దృష్టిలో రౌడీ షీటర్గానే ఉండడం బాధాకరంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత మంది ఎమ్మెల్యేల పేర్లు రౌడీ షీట్ లో ఉండేవి. కానీ ఇప్పుడు వారి పేర్లు ఆ లిస్ట్ లో పెట్టగలరా? దీనికి హోం మంత్రి లేదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వాపోయారు.