మీర్ ఆలం చెరువు టెన్షన్, నెహ్రూ జూ ఏరియా.. కిషన్‌బాగ్ ప్రజల నిద్రలేని రాత్రి

|

Oct 21, 2020 | 7:54 AM

భాగ్యనగరానికి మళ్లీ మొదలైన భారీ వర్షాలతో కిషన్‌బాగ్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రి గడిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక మీర్ ఆలం చెరువు కట్టతెగి ఎప్పుడు మీదపడుతుందోనని టెన్షన్..టెన్షన్ తో స్థానికులు కాలం వెళ్లదీస్తున్నారు. మజ్లీస్ స్థానిక కార్పొరేటర్ మొహమ్మద్ ముబిన్ రాత్రి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందు జాగ్రత్తగా చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే జూ పూర్తిగా మునిగిపోయి.. కిషన్ బాగ్ […]

మీర్ ఆలం చెరువు టెన్షన్, నెహ్రూ జూ ఏరియా.. కిషన్‌బాగ్ ప్రజల నిద్రలేని రాత్రి
Follow us on

భాగ్యనగరానికి మళ్లీ మొదలైన భారీ వర్షాలతో కిషన్‌బాగ్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రి గడిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక మీర్ ఆలం చెరువు కట్టతెగి ఎప్పుడు మీదపడుతుందోనని టెన్షన్..టెన్షన్ తో స్థానికులు కాలం వెళ్లదీస్తున్నారు. మజ్లీస్ స్థానిక కార్పొరేటర్ మొహమ్మద్ ముబిన్ రాత్రి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందు జాగ్రత్తగా చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే జూ పూర్తిగా మునిగిపోయి.. కిషన్ బాగ్ ఏరియా మూసీ నదిలో కొట్టుకుపోతుందంటూ ముబిన్ స్థానికులను హెచ్చరించారు. ఇలాఉంటే, మీర్ ఆలం చెరువులోకి వరద నీరు ఎక్కువగా రావడంతో అప్రమత్తమయిన అధికారులు రాత్రంతా ముందుజాగ్రత్తచర్యలు చేపట్టారు.