Omicron Variant: విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్‌ శిబిరాలు.. ఒమిక్రాన్‌పై భయం వద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

|

Dec 03, 2021 | 5:23 PM

Omicron Variant: సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఆందోళన నెలకొంటోంది. కరోనా మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకముంటే కొత్తవేరియంట్లు మరింత...

Omicron Variant: విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్‌ శిబిరాలు.. ఒమిక్రాన్‌పై భయం వద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy
Follow us on

Omicron Variant: సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఆందోళన నెలకొంటోంది. కరోనా మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకముంటే కొత్తవేరియంట్లు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌తో పాటు ఇతర దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ వేరియంట్‌, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ పై భయం వద్దు.. జాగ్రత్తలు పాటించి జయిద్దామని సూచించారు. వాక్సిన్ పై అపోహలు, భయాలు విడనాడి 100 శాతం వేసుకోవాలని అన్నారు. ఎలాంటి కోవిడ్ పరిస్థితులు ఎదురైనా ఎదర్కొవడానికి ప్రభుత్వం సిద్ధం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలలు , వసతి గృహలలో కోవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరమైన చోట విద్య సంస్థలలో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలలో పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాప్ లో 90 శాతం వ్యాక్సినేషన్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు.

గత ఏడాదికిపై ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడిలోకి రాకముందే మరో వేయింట్‌ భయాందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ అందరిలో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే 30 దేశాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్‌ భారత్‌తో పాటు ఇతర దేశాలకు వ్యాపించింది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కేసలుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ప్రతి ఒక్కరికి మాస్క్‌ ఉండేలా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మాస్క్‌ లేని వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి:

Omicron: ఒమిక్రాన్‌ కోసం ఔషధాన్ని తయారు చేసిన బ్రిటన్‌.. వివరాలు వెల్లడించిన పరిశోధకులు

Omicron Outbreak: వణికిస్తున్న ఒమిక్రాన్ విస్తరణ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి.. హాట్‌స్పాట్‌గా ఆ సిటీ!