రైతు బంధు అందకుంటే.. అధికారులపై చర్యలు: నిరంజన్ రెడ్డి

|

Jul 03, 2020 | 3:43 PM

రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అర్హత ఉన్న రైతుకు రైతు బంధు పథకం కింద నగదు అందకపోతే.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

రైతు బంధు అందకుంటే.. అధికారులపై చర్యలు: నిరంజన్ రెడ్డి
Follow us on

రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అర్హత ఉన్న రైతుకు రైతు బంధు పథకం కింద నగదు అందకపోతే.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 లక్షల ఐదు వేల మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్న మంత్రి.. ఇందుకు గానూ కోటి 40 లక్షల ఎకరాల భూమికి వర్తించే విధంగా ఏడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు.

శుక్రవారం వనపర్తి జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కరోనాతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపినప్పటికీ రైతుల సంక్షేమం దృష్ట్యా సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం కింద రైతు ఖాతాలలో నగదు జమ చేశామన్నారు. ఇంకా రైతుబంధు రావాల్సిన వారు నాలుగు లక్షల మంది ఉన్నారని.. మిగిలిన వారందరికీ రైతుబంధు ద్వారా నగదు జమ చేస్తామన్నారు.

అయితే, న్యాయబద్ధంగా రైతు బంధుకు అర్హత ఉండి రానట్లైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా వారి పరిధిలోని ఐదు వేల ఎకరాలకు సంబంధించి రైతుల వివరాలతొ పాటు పంటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తామని మంత్రి తెలిపారు. రైతులు కాలానుగుణంగా పంటల మార్పిడి ద్వారా ఎక్కువ దిగిబడితో పాటు అధికా లాభాన్ని పొందవచ్చిని, ముఖ్యంగా కూరగాయలు సాగు చేయాలని సూచించారు.