రైతుబంధు ఖాతాల్లో.. 48 గంటల్లో.. రూ.6886.19 కోట్లు జమ: నిరంజన్ రెడ్డి

| Edited By:

Jun 24, 2020 | 4:53 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతా వివరాలు నమోదుచేసుకున్న రైతులందరి ఖాతాలో

రైతుబంధు ఖాతాల్లో.. 48 గంటల్లో.. రూ.6886.19 కోట్లు జమ: నిరంజన్ రెడ్డి
Singireddy Niranjan Reddy
Follow us on

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతా వివరాలు నమోదుచేసుకున్న రైతులందరి ఖాతాలో రైతుబంధు పథకం కింద నగదు జమ చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 48గంటల్లో 54.21 లక్షల మంది రైతులఖాతాలో 6,886.19 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. జనవరి నుంచి జూన్‌16వ తేదీ వరకూ పాస్‌పుస్తకాలు అందిన రైతులు సంబంధిత ఏఈఓల వద్ద బ్యాంకు ఖాతా వివరాలు నమోదుచేసుకోవాలని ఆయన సూచించారు.

సాగుచేసే రైతన్నకు సాయంగా నిలబడడానికి ముఖ్యమ్రంతి కేసీఆర్‌ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. కాగా.. రైతుబంధు నిధులు జమకాని రైతుల సందేహాలు క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం మూలంగానే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందన్నారు. కేసీఆర్‌ వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రోత్సాహం, చిత్తశుద్ధికి నిదర్శనమే రైతుబంధు నిధుల జమ అని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Also Read: వావ్.. ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన చాయ్ వాలా కూతురు..