కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

| Edited By: Pardhasaradhi Peri

Nov 11, 2020 | 10:00 PM

హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 50 కంప్యాక్టర్ వాహనాలను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ వాహనాల...

కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Follow us on

Minister KTR Will Launch Compactor Vehicles : హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 50 కంప్యాక్టర్ వాహనాలను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ వాహనాల ద్వారా 15 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించనున్నారు.

నెక్లెస్ రోడ్ ఐమ్యాక్స్ సమీపంలోని మైదానంలో ఈ వాహనాలను మంత్రులు కేటీఆర్, మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్​లు కలిసి ప్రారంభిస్తారు. అనంతరం సంజీవయ్య పార్కు వద్ద ఆధునీకరించిన చెత్త తరలింపు కేంద్రాన్ని కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.