కాసేపట్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

|

Aug 14, 2020 | 8:22 AM

బస్తీవాసులకు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తోంది. నగరంలో డివిజన్‌కు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు...

కాసేపట్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Follow us on

బస్తీవాసులకు వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తోంది. నగరంలో డివిజన్‌కు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే నగరంలో 170 దవాఖానాలు ఉండగా మరో 25 శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభోత్సవాల్లో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేటర్లు పాల్గొంటారు.

ఇందులో జవహర్‌నగర్‌, రామంతాపూర్‌లోని రాంరెడ్డినగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. భోలక్‌పూర్‌, బన్సీలాల్‌పేటలోని బాపూజీనగర్‌లో బస్తీ దవాఖానాలను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఖైరతాబాద్‌లోని జవహర్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌లోని బస్తీ దవాఖానాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు.

వాస్తవంగా 26 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని భావించగా.. జియాగూడలోని రెండు పడకల ఇళ్ల వద్ద సిద్ధమైన బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా పడింది. రెండు పడకల ఇళ్లు ప్రారంభించిన తరువాత ఇక్కడ దవాఖానా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.