డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో పది శాతం వారికే..

|

Sep 17, 2020 | 6:46 PM

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌. గ్రేటర్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయని వివరించారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ పనులపై సమీక్షించారు...

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో పది శాతం వారికే..
Follow us on

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌. గ్రేటర్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయని వివరించారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ పనులపై సమీక్షించారు మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి.

హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్లతో కలిసి ఎంపిక చేయాలని సూచించారు కేటీఆర్‌. కడుతున్న ఇళ్లలో పది శాతం లేదంటే వెయ్యికి మించకుండా స్థానికులకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ఇల్లు అందిన వారికి, మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు కేటీఆర్‌.