‘బస్తీ దవాఖానా’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

|

Aug 14, 2020 | 10:55 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇవాళ కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి...

బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Follow us on

Basti Davakhana Opened by Minister ktr : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇవాళ కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. వీటిని హైదరాబాద్ లోని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రారంభించారు. హబ్సిగూడా డివిజన్‌లోని రామ్‌ రెడ్డి నగర్‌లో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం బస్తీ దవాఖనాలో మంత్రి కేటీఆర్ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇప్పటికే బల్దియా పరిధిలో 170 బస్తీ దవాఖానాల ద్వారా పలు వైద్య సేవలు అందిస్తున్నారు. మురికివాడల్లో నివసించే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే బస్తీ దవాఖానాల ప్రధాన లక్ష్యంగా 2018 ఏప్రిల్‌ 6న తొలి బస్తీ దవాఖానాను ప్రభుత్వం ప్రారంభించింది. రానున్న రోజుల్లో నగరంలోని ప్రతి వార్డుకు రెండు చొప్పున 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.