ప్రభుత్వ మెడికల్ కాలేజీల సిబ్బందితో సమావేశమైన మంత్రి ఈటల.. మెడికల్ సీట్ల గురించి ఏం చెప్పారో తెలుసా?

|

Dec 18, 2020 | 5:46 AM

మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో తెలంగాణ వైద్యాఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల సిబ్బందితో సమావేశమైన మంత్రి ఈటల.. మెడికల్ సీట్ల గురించి ఏం చెప్పారో తెలుసా?
Follow us on

మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో తెలంగాణ వైద్యాఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజీల హాస్పిటల్‌ల సూపరింటెడెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న మౌలికవసతులు, అధ్యాపకులు, స్టాఫ్, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజా విధివిధానాలకు అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బంద్‌లు, ధర్నాలు జరిగినా వైద్య ఆరోగ్య సిబ్బంది 365 రోజులు పని చేయాలని సూచించారు. కరోనా సమయంలో కూడా క్యాన్సర్, డయాలసిస్, తలసేమియా లాంటి జబ్బులకు అంతరాయం లేకుండా వైద్య సేవలు అందిచామని గుర్తుచేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు అన్ని హాస్పిటల్ లు ఒక చైన్ సిస్టమ్‌లా పని చేయాలన్నారు. చిన్న చిన్న జబ్బులకు పెద్ద ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రుల్లోనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల చికిత్స అందించాలని కేవలం అత్యవసర, క్లిష్ట సమస్యలకి మాత్రమే పెద్దాసుపత్రి లకు పంపించాలని అధికారులకు సూచించారు. అన్ని మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ సేవలు మరింత మెరుగు పరచాలన్నారు. కరోనా సమయంలో శక్తి వంచన లేకుండా పని చేసిన మెడికల్ కాలేజ్‌ల సిబ్బందికి మంత్రి ఈటల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా రమేష్ రెడ్డి, tsmidc ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.