కరోనాకు వ్యాక్సిన్ వస్తే.. పేదలకే తొలి ప్రాధాన్యం..

|

Oct 08, 2020 | 5:34 PM

కరోనాకు వ్యాక్సిన్ వస్తే.. పేదలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బస్తీల్లో ఉండే వారికి వ్యాక్సిన్ అందేలా చూస్తామన్నారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయవచ్చని అంచనా వేయడానికి..

కరోనాకు వ్యాక్సిన్ వస్తే.. పేదలకే తొలి ప్రాధాన్యం..
Follow us on

Corona Vaccine : కరోనాకు వ్యాక్సిన్ వస్తే.. పేదలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బస్తీల్లో ఉండే వారికి వ్యాక్సిన్ అందేలా చూస్తామన్నారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయవచ్చని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మంత్రివర్గ ఉప సంఘం నివేదిక సిద్ధం చేశామన్న ఆయన.. సీఎంకు అందిస్తామన్నారు.

హెల్త్ రంగంలో తెలంగాణను దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చుదిద్దాతామని మంత్రి ఈటల అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌గా దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను సిద్ధం చేస్తామని ప్రకటించారు. కంటి వెలుగును సక్సెస్ చేశామని వెల్లడించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి.. కంప్యూరీకరిస్తామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్స్ మెరుగైన సేవలు అందిస్తున్నారన్న ఈటల.. రానున్న రోజుల్లో PHCలను మరింత బలోపేతం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించిందన్నారు.