యూకే నుంచి తెలంగాణ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా…జీన్ మ్యాపింగ్ టెస్టులకు పంపించామన్న మంత్రి ఈటెల రాజేందర్

|

Dec 24, 2020 | 8:44 PM

కొత్త రకం కరోనా పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చినట్లు చెప్పారు. వారిలో 846 మందిని...

యూకే నుంచి తెలంగాణ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా...జీన్ మ్యాపింగ్ టెస్టులకు పంపించామన్న మంత్రి ఈటెల రాజేందర్
Follow us on

Review on New Corona : కొత్త రకం కరోనా పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చినట్లు చెప్పారు. వారిలో 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు చేయగా.. ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. ఇందులో జగిత్యాల 2, వరంగల్ 1, హైదరాబాద్ 2, మేడ్చల్ 1, సిద్దిపేటలో ఒకరికి కరోనా సోకినట్లు తెలిపారు. జీన్ మ్యాపింగ్ టెస్టుల కోసం ఏడుగురి శాంపిల్స్ సీసీఎంబీకి పంపించినట్లుగా తెలిపారు. పాజిటివ్ వ్యక్తులను కలిసిన అందరినీ ట్రేసింగ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదిలావుంటే.. అన్ని జిల్లాల్లో యూకే వెళ్లొచ్చిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి కరీంనగర్‌కు వచ్చిన 16 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 10 మంది శాంపిల్స్‌ను అధికారులు తీసుకున్నారు. మరో ఆరుగురి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. యూకే నుంచి ఆదిలాబాద్ జిల్లాకు 12 మంది వచ్చిన వారి నుంచి శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌కు పంపారు.