నైజీరియాలో ఉగ్రవాదుల దుశ్చర్య.. ఏకంగా 60 మంది..

| Edited By:

Jun 14, 2020 | 5:27 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనపడని ఈ మహమ్మారి వైరస్‌తో అన్ని దేశాలు పోరాడుతున్నాయి.

నైజీరియాలో ఉగ్రవాదుల దుశ్చర్య.. ఏకంగా 60 మంది..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనపడని ఈ మహమ్మారి వైరస్‌తో అన్ని దేశాలు పోరాడుతున్నాయి. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ను కనుగొని వైరస్‌కు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు పోరాడుతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు మాత్రం నిత్యం ఎక్కడో ఓ చోట దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా నైజీరాయాలో ఇస్లామిక్ మిలిటెంట్లు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. మాంగునో, నాగన్‌ జాయ్ ప్రాంతంలో ఇస్లామిక్ టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో 20 మంది సైనికులు చనిపోయారు. అంతేకాదు మరో 40 మంది సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. రాకెట్ లాంఛర్లను ఉపయోగించి ఉగ్రవాదులు దాడులు జరిపారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో 20 మంది సైనికులు చనిపోయారని.. వందలాది మంది గాయపడ్డారని తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు స్తానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌ను కూడా దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.