వలస కూలీ కూతురు.. పదో తరగతిలో అదరగొట్టింది..

| Edited By:

Jul 13, 2020 | 10:11 PM

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో.. వలస కూలీల గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు పడ్డ కష్టాలు మాటల్లో చెప్పలేనివి. ఇప్పటికీ ఆ కష్టాల్లోనే చాలా మంది

వలస కూలీ కూతురు.. పదో తరగతిలో అదరగొట్టింది..
Follow us on

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో.. వలస కూలీల గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కూలీలు పడ్డ కష్టాలు మాటల్లో చెప్పలేనివి. ఇప్పటికీ ఆ కష్టాల్లోనే చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. కొందరికి కనీస నివాసం లేక ఫుట్‌పాత్‌లపైనే బతుకుతున్నారు. అలాంటి ఓ కుటుంబానికి చెందిన పూజారాణి అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. హర్యానాకు చెందిన ఆ విద్యార్థిని సీబీఎస్‌ఈ విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 80.4% మార్కులు సాధించింది.

“ఐదేళ్ల క్రితం, నేను నా విద్యను ‘గాంధీ పాఠశాల’ నుండి ప్రారంభించాను. వీధిలైట్ కింద ఇక్కడి వలస కూలీల పిల్లలు చాలా మంది చదువుకుంటారు.” అని పూజా తెలిపారు. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్ మంచి మార్కులతో పాసైన పూజారాణిని ప్రశంసించారు. ప్రతిభకు ఏదీ అడ్డం కాదని, అసాధ్యమైనదేదీ లేదని కొనియాడారు. ‘‘తన కుటుంబంతో కలిసి చిన్న షెడ్‌లో నివసిస్తున్న పూజారాణి ఏమీ అసాధ్యం కాదని నిరూపించింది. పూజా.. నువ్వు చాలా మందికి ప్రేరణ’’ అని రాసుకొచ్చారు.

[svt-event date=”13/07/2020,9:20PM” class=”svt-cd-green” ]