IPL 2020 MI vs KXIP: డికాక్‌, పొలార్డ్‌ మెరుపులు, పంజాబ్ టార్గెట్ 177

|

Oct 18, 2020 | 9:49 PM

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. 

IPL 2020 MI vs KXIP: డికాక్‌, పొలార్డ్‌ మెరుపులు, పంజాబ్ టార్గెట్ 177
Follow us on

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. ఆఖరి ఓవర్లలో పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) విరుచుకుపడటంతో పంజాబ్‌కు ముంబై 177 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. పంజాబ్‌ బౌలర్ల తొలుత విరుచుకుపడటంతో పవర్‌ప్లేలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్‌ శర్మ (9), సూర్యకుమార్ (0), ఇషాన్‌ కిషన్‌ (7) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (34; 30 బంతుల్లో, 4×4, 1×6)తో కలిసి ఓపెనర్‌ డికాక్‌ డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6) ఇన్నింగ్స్‌‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 58 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. అయితే జోరు పెంచే క్రమంలో కృనాల్‌ ఔటయ్యాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న డికాక్‌ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే హార్దిక్‌ పాండ్య (8)ను షమి, డికాక్‌ను జోర్డాన్‌ వరుస ఓవర్లలో ఔట్ చేసి ఆ జట్టును మరోసారి దెబ్బ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కౌల్డర్‌నైల్‌తో కలిసి పొలార్డ్‌ అదరగొట్టాడు. అర్షదీప్ వేసిన 18వ ఓవర్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లు, నైల్‌ రెండు ఫోర్‌లు బాదారు. వీరిద్దరి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో 54 రన్స్ వచ్చాయి. పంజాబ్‌ బౌలర్లలో షమి, అర్షదీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, జోర్డాన్‌, బిష్ణోయ్‌ చెరో వికెట్ తీశారు.