Woman Kills Giraffe : వాలెంటైన్స్ రోజున భార్యకు భర్త కాస్టిలీ గిఫ్ట్…. ఇద్దరినీ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

|

Feb 24, 2021 | 9:10 AM

ప్రపంచంలోని ప్రేమికులు ప్రేమికుల దినోత్సవం రోజున కానుకగా పువ్వులు, చాకోలెట్స్, టెడ్డీబేర్లు వంటివి అనేక ఇస్తుంటారు. అయితే తాజగా దక్షిణాఫ్రికాలోని ఓ వేటగాడు తన భార్యకు వాలెంటైన్స్ కానుకగా...

Woman Kills Giraffe :  వాలెంటైన్స్ రోజున భార్యకు భర్త కాస్టిలీ గిఫ్ట్.... ఇద్దరినీ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Follow us on

Woman Killed Giraffe : ప్రపంచంలోని ప్రేమికులు ప్రేమికుల దినోత్సవం రోజున కానుకగా పువ్వులు, చాకోలెట్స్, టెడ్డీబేర్లు వంటివి అనేక ఇస్తుంటారు. అయితే తాజగా దక్షిణాఫ్రికాలోని ఓ వేటగాడు తన భార్యకు వాలెంటైన్స్ కానుకగా ఏకంగా జిరాఫీ గుండెను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణాఫ్రికాకు చెందిన మెరెలైజ్ వాన్ డెర్ మెర్వే అనే మహిళ తాను చంపిన జిరాఫీ హృదయాన్ని పట్టుకుని ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోకు తనకు వాలెంటైన్స్ డే కానుకగా జిరాఫీగుండెను ఇచ్చాడని.. ఆ జంతువును చంపడానికి తన భర్త ట్రోఫీ ఏకంగా రూ. 1. లక్షలు చెల్లించాడని ఓ కామెంట్ కూడా జత చేసింది. ఈ పోస్టు పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే ఆమె తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు జిరాఫీ గుండె ఎంత పెద్దదో ఎప్పుడైనా ఆలోచించారా..? ఇదే నాకు వాలెంటైన్స్ డే కి పెద్ద గిఫ్ట్ ఈ బహుమతితో నేను ఖచ్చితంగా చంద్రునిపై ఉన్నానని ఫీల్ అవుతున్నానంటూ మెరిలైజ్ పోస్ట్ చేసింది. ఇక జిరాఫీ చర్మాన్ని రగ్గుగా ఉపయోగించాలని లోచిస్తున్నట్లు వాన్ డెర్ మెర్వే ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపింది.

ఈ పోస్టు పై ఫోటో లపై జంతు హక్కుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ నుంచి ఈ పోస్టును డిలీట్ చేయాలనీ ఫిర్యాదు చేశారు. ఇక ఈ దంపతులు ఇద్దరూ కలిసి సుమారు 500 జంతువులను చంపినట్లు అధికారులు భావిస్తున్నారు.

Also Read:

 క్రిష్ మూవీలో కుస్తీ వీరులతో పోరాటానికి సిద్ధమైన రాబిన్ హుడ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్

 నిఖిల్‌తో ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న అందాల అనుపమ.. హిట్‌ సినిమా సీక్వెల్‌లో..