ప్రైవేటు మెడిక‌ల్, డెంట‌ల్ కాలేజీల‌కు షాక్…రెండోసారి మెమోలు.

|

Jun 09, 2020 | 4:19 PM

ఏపీలోని ప్రైవేటు మెడిక‌ల్, డెంట‌ల్ కాలేజీల‌పై మళ్లీ చర్యలు తీసుకునేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ రంగం సిద్దం చేసింది. కౌన్సిలింగ్​లో ప్రవేశాలు కల్పించిన పీజీ స్టూడెంట్ల‌ను ఎందుకు చేర్చుకోవడం లేదో ఆన్స‌ర్ ఇవ్వాల‌ని ఈ నెల 5న నోటీసులు ఇచ్చింది. స‌ద‌రు నోటీసుల గడువు 8 వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. అన్ని ప్రైవేటు కాలేజీల నుంచి వ‌చ్చిన‌ సమాధానాలతో సంతృప్తి చెంద‌ని విశ్వవిద్యాలయం…రెండోసారి మెమోలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల్లోగా స‌మాధాన‌మివ్వాల‌ని […]

ప్రైవేటు మెడిక‌ల్, డెంట‌ల్ కాలేజీల‌కు షాక్...రెండోసారి మెమోలు.
Follow us on

ఏపీలోని ప్రైవేటు మెడిక‌ల్, డెంట‌ల్ కాలేజీల‌పై మళ్లీ చర్యలు తీసుకునేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ రంగం సిద్దం చేసింది. కౌన్సిలింగ్​లో ప్రవేశాలు కల్పించిన పీజీ స్టూడెంట్ల‌ను ఎందుకు చేర్చుకోవడం లేదో ఆన్స‌ర్ ఇవ్వాల‌ని ఈ నెల 5న నోటీసులు ఇచ్చింది. స‌ద‌రు నోటీసుల గడువు 8 వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. అన్ని ప్రైవేటు కాలేజీల నుంచి వ‌చ్చిన‌ సమాధానాలతో సంతృప్తి చెంద‌ని విశ్వవిద్యాలయం…రెండోసారి మెమోలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల్లోగా స‌మాధాన‌మివ్వాల‌ని కోరింది. అలాగే స్టూడెంట్స్ ఆయా కళాశాలల్లో చేరాల్సిన గడువు ఈ నెల 10 వ తేదీతో ముగియనున్న నేప‌థ్యంలో యూనివ‌ర్సిటీ కఠిన చర్యలు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రవేశాలను ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీలు తప్పకుండా చేర్చుకోవాలని మరోసారి రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ హెచ్చ‌రించారు.

యూనివ‌ర్సిటీ 2019-20 అక‌డ‌మిక్ ఇయ‌ర్ లో 28 కాలేజీల్లో 3 వేల మందికి ప్రవేశాలు ఇచ్చింది. వీరికి ఏడాది చివరన యాన్వ‌ల్ ఎగ్జామ్స్ నిర్వహించాలి. కానీ లాక్ డౌన్​తో నాలుగు నెలల పాటు కాలేజీలు న‌డ‌వ‌లేదు. జులై తర్వాత క్లాసెస్ ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడిస్తామని వర్శిటీ తెలిపింది. ఈ క్రమంలో కళాశాలలు ఆన్​లైన్​ క్లాసెస్ నిర్వహించాయి. ఇంతలోనే ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్ర‌క‌టించింది. సాధారణ డిగ్రీలకు ఆన్ లైన్ తరగతులతో ఎగ్జామ్స్ రాసే వీలుంటుంది. ప్రయోగాలే కీలకమైన ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారని విద్యార్థుల‌ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విశ్వవిద్యాలయం మ‌రోసారి ఆలోచించాలని కోరుతున్నారు.