ఇండియా-పాక్ మ్యాచ్‌పై మెహబూబా ట్వీట్

| Edited By:

Jun 16, 2019 | 6:52 PM

ప్రపంచకప్ యుద్ధంలో దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యంత ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన చరిత్ర పాకిస్థాన్‌కు లేదు. ఇదే ఆనవాయితీని కొనసాగించాలని కోహ్లీ టీమ్ పట్టుదలతో ఉంది. మరోవైపు ఎలాగైనా టీమిండియాను ఓడించాలన్న పట్టుదలతో పాకిస్థాన్ సర్వ శక్తులను కూడగట్టుకుని పోరాటానికి సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌పై జమ్మూ […]

ఇండియా-పాక్ మ్యాచ్‌పై మెహబూబా ట్వీట్
Follow us on

ప్రపంచకప్ యుద్ధంలో దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యంత ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన చరిత్ర పాకిస్థాన్‌కు లేదు. ఇదే ఆనవాయితీని కొనసాగించాలని కోహ్లీ టీమ్ పట్టుదలతో ఉంది. మరోవైపు ఎలాగైనా టీమిండియాను ఓడించాలన్న పట్టుదలతో పాకిస్థాన్ సర్వ శక్తులను కూడగట్టుకుని పోరాటానికి సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే ఈ మ్యాచ్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్లలో మంచి ఆట తీరు కనబర్చిన జట్టు గెలవాలని ఆమె ట్వీట్ చేశారు. ‘ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు గెలవొచ్చు. తమకు నచ్చిన జట్టును సమర్ధించుకోవడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుంది. కాబట్టి దీనిని క్రీడీస్ఫూర్తితో తీసుకోండి’’ అని మెహబూబా ట్వీట్ చేశారు.