కాలిఫోర్నియాలోని ఈ రాజభవనం అద్దె ఎంతో తెలుసా..!

|

Oct 18, 2020 | 5:46 PM

అమెరికా కాలిఫోర్నియా స్టేట్‌లోని ‘మాంటెసిటో మాన్షన్‌’ను గంటల లెక్కన అద్దెకిస్తున్నట్లు రెంటల్‌ వెబ్‌సైట్‌ గిగ్‌స్టార్‌లో ఓ ప్రకటన కనిపించింది.

కాలిఫోర్నియాలోని ఈ రాజభవనం అద్దె ఎంతో తెలుసా..!
Follow us on

అమెరికా కాలిఫోర్నియా స్టేట్‌లోని ‘మాంటెసిటో మాన్షన్‌’ను గంటల లెక్కన అద్దెకిస్తున్నట్లు రెంటల్‌ వెబ్‌సైట్‌ గిగ్‌స్టార్‌లో ఓ ప్రకటన కనిపించింది. ‘ది చేత్యూ’ అని కూడా పిలచే ఈ భవనం 5.4 ఎకరాల విస్తీర్ణంలో, 14,563 చదరపు అడుగుల్లో విశాలంగా ఉంటుంది. ఇటాలియన్‌ శైలిలో దీన్ని నిర్మించారు. సినిమాతో పాటు వివిధ రకాల షూటింగులు.. మ్యూజియం కోసం దీన్ని అద్దెకు ఇస్తారని సదరు వెబ్‌సైట్ తెలిసింది. అయితే గంటకు రేటెంతో తెలిస్తే మాత్రం కాస్త దిమ్మతిరుగుతుంది. ఒక గంటకు 700 డాలర్లు అంటే సుమారు 51,410 రూపాయలు అనమాట.

లాస్‌ ఏంజెలిస్‌ సిటీకి దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో కలిగిన ఈ బిల్డింగ్ ఆవరణలో స్విమ్మింగ్ పూల్,  టీ హౌజ్, టెన్నీస్‌ కోర్టు, చిల్డ్రన్‌ కాటేజీలు స్పెషల్ అట్రాక్షన్‌గా‌ నిలుస్తున్నాయి. ఈ భవనంలోనే ఓ రూమ్ నిండా వైన్‌ బాటిల్స్ ఉంటాయి. కానీ వాటిని తాకకూడదు. అక్కడివే కాదు బయట నుంచి మద్యం తీసుకెళ్లి తాగడానికి కూడా అనుమతి లేదు. అడల్ట్ వీడియో షూటింగులు నిషేధం. ఎటువంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకూడదని నిబంధనల్లో ఉంది.  ఇంతకు ఈ భవనం ఓనర్స్ ఎవరంటే బ్రిటీష్‌ యువరాజు ప్రిన్స్‌ హారీ, మేఘన్‌ మార్కెల్‌ దంపతులు. 2003లో నిర్మించిన భవనాన్ని అమెరికా వచ్చినప్పుడు ఉండేందుకు హారీ కపుల్ 14,7 మిలియన్‌ డాలర్లు (దాదాపు 108 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారట. ( Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు ! )