నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో జోష్..

| Edited By: Pardhasaradhi Peri

Sep 10, 2020 | 8:53 PM

స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల కొనుగోళ్ల అండతో ... రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్‌ చేస్తూ భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లూ రాణించడమూ కలిసొచ్చింది.

నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో జోష్..
Follow us on

Market Closes High  : స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల కొనుగోళ్ల అండతో … రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్‌ చేస్తూ భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లూ రాణించడమూ కలిసొచ్చింది. మార్కెట్ల లాభాల్లో సింహ భాగం రిలయన్స్‌దే. రిలయన్స్‌ రిటైల్‌ విభాగంలో సిల్వర్‌ లేక్‌ వాటాలు కొనుగోలు వార్తలు రిలయన్స్‌ షేర్ల దూకుడు కారణమైంది.

ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే దూకుడును కనబరిచాయి. సెన్సెక్స్‌ 646.40 పాయింట్ల లాభంతో 38,840.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 171.25 పాయింట్ల లాభంతో 11,449.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.45 గా ఉంది. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌, ఐవోసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టపోయాయి.