ఎన్నికల వేళ చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా

| Edited By:

Apr 11, 2019 | 12:05 PM

భద్రతా దళాలు లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఇవాళ తెల్లవారుజామున ఎన్నికల నిర్వహణ కోసం వెళ్తున్న సిబ్బంది, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా బస్తర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సంఘటన చోసుకుంది. అయితే ఈ దాడి నుంచి అందరూ క్షేమంగా బయటపడినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ‘‘నారాయణ్‌పూర్- దన్వాన్ రోడ్డులో ఫరాస్‌గాన్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున 4:15కి పేలుడు జరిగింది. ఎన్నికల సిబ్బందిని భద్రతా దళాలు […]

ఎన్నికల వేళ చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా
Follow us on

భద్రతా దళాలు లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఇవాళ తెల్లవారుజామున ఎన్నికల నిర్వహణ కోసం వెళ్తున్న సిబ్బంది, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లా బస్తర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సంఘటన చోసుకుంది. అయితే ఈ దాడి నుంచి అందరూ క్షేమంగా బయటపడినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ‘‘నారాయణ్‌పూర్- దన్వాన్ రోడ్డులో ఫరాస్‌గాన్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున 4:15కి పేలుడు జరిగింది. ఎన్నికల సిబ్బందిని భద్రతా దళాలు పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్తుండగా మావోయిస్టులు వారిపై గురిపెట్టారు. అయితే భద్రతా దళాలు తమ దారి మార్చుకుని ఓ అడవి గుండా మావోయిస్టులను చుట్టుముట్టారు. దీంతో భయపడిన మావోయిస్టులు ఐఈడీని పేల్చివేసి అక్కడి నుంచి పారిపోయారు..’’ అని సదరు అధికారి వెల్లడించారు.