మిలిటెంట్ పోరాటం చేయండి.. ఆర్టీసీ సమ్మెపై ..మావోయిస్టు జగన్ లేఖ

| Edited By:

Oct 07, 2019 | 1:07 PM

తెలంగాణలొ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సిబ్బంది వెంటనే విధులకు హాజరుకాకపోతే వారిని ఉద్యోగులుగా పరిగణించబోమంటూ ఆదివారం రాత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల తర్వాత కూడా కార్మికుల్లో మార్పు రాలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె విరమించేది లేదని కార్మిక నేతలు ఖరాకండీగా చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. […]

మిలిటెంట్ పోరాటం చేయండి.. ఆర్టీసీ సమ్మెపై ..మావోయిస్టు జగన్ లేఖ
Follow us on

తెలంగాణలొ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సిబ్బంది వెంటనే విధులకు హాజరుకాకపోతే వారిని ఉద్యోగులుగా పరిగణించబోమంటూ ఆదివారం రాత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల తర్వాత కూడా కార్మికుల్లో మార్పు రాలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరేవరకు సమ్మె విరమించేది లేదని కార్మిక నేతలు ఖరాకండీగా చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది.

టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతునిస్తూ మావోయిస్టు  పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ .. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సంస్ధకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు  ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మెను విరమించవద్దని, అవసరమైతే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. వేలాది మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేలా చేస్తున్న సీఎం కేసీఆర్ తీరు మార్చుకోవాలని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.