జార్ఖండ్ లో దారుణం.. ఇంట్లో అందరినీ నరికేసి ఇంటికి నిప్పుపెట్టిన ఉన్మాది

| Edited By:

Oct 18, 2020 | 7:35 PM

జార్ఖండ్ : ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి సొంత కుటుంబ సభ్యుల్నే పొట్టన పెట్టుకున్న దారుణ ఘటన జార్ఖండ్‌లోని సరాయ్ కేలా జిల్లాలో జరిగింది. 40 ఏళ్ల చిన్నూ సోరెన్ బాగా మద్యం సేవించి గురువారం పొరుగింట్లో నిద్రించాడు. ఏమైందో ఏమో కానీ శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లోకి వెళ్లి కనపడిన వారందరిపై దాడి చేశాడు. పదునైన కత్తితొ తన కుటుంబ సభ్యులందరినీ నరికేసి.. ఇంటికి నిప్పుపెట్టాడు. సోదరుడు రబీ మాంఝీ(45)పై మొదట దాడి చేసిన సోరెన్.. […]

జార్ఖండ్ లో దారుణం.. ఇంట్లో అందరినీ నరికేసి ఇంటికి నిప్పుపెట్టిన ఉన్మాది
Follow us on

జార్ఖండ్ : ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి సొంత కుటుంబ సభ్యుల్నే పొట్టన పెట్టుకున్న దారుణ ఘటన జార్ఖండ్‌లోని సరాయ్ కేలా జిల్లాలో జరిగింది. 40 ఏళ్ల చిన్నూ సోరెన్ బాగా మద్యం సేవించి గురువారం పొరుగింట్లో నిద్రించాడు. ఏమైందో ఏమో కానీ శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లోకి వెళ్లి కనపడిన వారందరిపై దాడి చేశాడు. పదునైన కత్తితొ తన కుటుంబ సభ్యులందరినీ నరికేసి.. ఇంటికి నిప్పుపెట్టాడు. సోదరుడు రబీ మాంఝీ(45)పై మొదట దాడి చేసిన సోరెన్.. అనంతరం సోదరుడి భార్య పార్వతి(30), వారి పిల్లలు జీతన్(15), సురేశ్(13). పరేశ్(11)లను దారుణంగా హత్యచేశాడు. ఆ తరువాత తన మరో సోదరుడు, తల్లిపై కూడా దాడి చేసి ఇంటికి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సోరెన్‌ను అరెస్ట్ చేసి కేసు విచారణ ప్రారంభించారు. అయితే సోరెన్ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.