జాత్యహంకారికి 419 ఏళ్ల జైలు శిక్ష

| Edited By:

Jul 17, 2019 | 9:47 AM

రెండేళ్ల క్రితం అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన యునైటెడ్ ది రైట్ ర్యాలీపైకి తన కారును నడిపించిన జేమ్స్ అలెక్స్‌కి అక్కడి కోర్టు జీవిత ఖైదుతో.. ఏకంగా 419 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలో జాత్యహంకారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. బానిసత్వ వ్యవస్థను రూపుమాపి అందరికి సమాన హక్కులు కల్పించినా నల్లవారి పట్ల విపక్ష ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. అమెరికాలో శ్వేత జాతీయులకు, నల్లవారికి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో […]

జాత్యహంకారికి 419 ఏళ్ల జైలు శిక్ష
Follow us on

రెండేళ్ల క్రితం అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన యునైటెడ్ ది రైట్ ర్యాలీపైకి తన కారును నడిపించిన జేమ్స్ అలెక్స్‌కి అక్కడి కోర్టు జీవిత ఖైదుతో.. ఏకంగా 419 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలో జాత్యహంకారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. బానిసత్వ వ్యవస్థను రూపుమాపి అందరికి సమాన హక్కులు కల్పించినా నల్లవారి పట్ల విపక్ష ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. అమెరికాలో శ్వేత జాతీయులకు, నల్లవారికి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017 ఆగష్టు 12న జరిగిన ఘటన అందరిని దిగ్బాంతికి గురిచేసింది. అమెరికా అంతర్యుద్ధంలో దక్షిణాది రాష్ట్రాల తరపున పోరాడిన జనరల్ రాబర్ట్ ఈలీని శ్వేత జాతీయులు హీరోగా భావిస్తారు.

వర్జీనియా చార్లెట్ వెల్లిలో ఉన్న రాబర్ట్ ఈలీ విగ్రహాన్ని తొలగించాలనే నిర్ణయం శ్వేత జాతీయులకు ఆగ్రహాన్ని తెప్పించింది. విగ్రహం తొలగింపును నిరసిస్తూ.. వారు ఆందోళనకు దిగారు. అదే సమయంలో విగ్రహాన్ని తొలగించాలంటూ మరో వర్గం ఆందోళనకు దిగింది. రాబర్ట్ ఈలీని విగ్రహాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన వారిలో జేమ్స్ అలెక్స్ కూడా ఉన్నారు. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్న వారిని చూడగానే అతనిలోని జాత్యహంకారం బుసలు కొట్టింది. దీంతో తన కారుతో వేగంగా వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో హెదర్ హెయర్ అనే యువతి మరణించగా, 24 మంది గాయపడ్డారు. దీంతో అమెరికా వ్యాప్తంగా జాతివైరం మరింత పెరిగింది. ఈ ఘటనతో జేమ్స్ అలెక్స్‌కు అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.