డ్రైవింగ్ టెస్ట్ పాసైన 10 నిమిషాల్లోనే..!

| Edited By:

Mar 05, 2020 | 10:18 PM

చైనా ప్రావిన్స్ గుయిజౌలోని లాపింగ్ వంతెనపై దారుణం జరిగింది. డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ వ్యక్తి ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇరుకు వంతెనపై ఎదురుగా వస్తున్న పాదచారులను చూసి

డ్రైవింగ్ టెస్ట్ పాసైన 10 నిమిషాల్లోనే..!
Follow us on

చైనా ప్రావిన్స్ గుయిజౌలోని లాపింగ్ వంతెనపై దారుణం జరిగింది. డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ వ్యక్తి ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇరుకు వంతెనపై ఎదురుగా వస్తున్న పాదచారులను చూసి ఒక్కసారే కారు స్టీరింగ్‌ను పక్కకి తిప్పాడు. దీంతో ఆ కారు రెప్పపాటు వ్యవధిలో నదిలో పడింది. చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాకు చెందిన జాంగ్ అనే డ్రైవర్ అప్పుడే డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరాడు. ఆ టెస్టులో పాసైనందుకు అధికారులు కూడా అతన్ని అభినందించారు. అనంతరం అతడికి కంగ్రాట్స్ చెబుతూ మొబైల్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపారు. అతడి కారు సరిగ్గా ఇరుకు వంతెన మీదకు వచ్చినప్పుడే ఆ మెసేజ్ వచ్చింది.

అసలే ఇరుకు వంతెన.. ఆ మొబైల్‌కు టెక్ట్స్ మెసేజ్ చూస్తుండగా, వంతెనపై ఎదురుగా పాదచారులు కనిపించారు. అంతే.. కంగారులో స్టీరింగ్ ఒక్కసారే పక్కకి తిప్పాడు. కారుతో సహా నదిలో పడిపోయాడు. వెంటనే డోరు తెరుచుకుని ఒడ్డుకు వచ్చి అతడి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఆ వంతెనపై ఉన్న సీసీటీవీ కెమేరాలో ఈ ఘటన రికార్డైంది. దీన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. నెట్టింట్లో క్షణాల్లో వైరల్‌గా మారింది.