సెల్ టవర్ ఎక్కా.. “పెళ్లి” చేయండి..!

చిత్తూరు జిల్లా వళ్లియప్పనగర్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సంతప్ కుమార్ అనే వ్యక్తి తనకు ఇంట్లో వాళ్లు వివాహం చేయలేదని సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. తాను ఇష్టపడ్డ అమ్మాయితో వివాహం చేయాలని లేకపోతే దూకేస్తానంటూ కాసేపు హడావుడి చేశాడు. కాసేపు ఇతడు చేసిన హంగామాతో ట్రాఫిక్ జామ్ అయింది. సెల్ టవర్ చుట్టూ వాహనాలు నిలిచిపోయాయి. చివరికి పోలీసులు వచ్చి అతడిని కిందికి దించారు. కాగా, సంపత్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా […]

సెల్ టవర్ ఎక్కా.. పెళ్లి చేయండి..!

Updated on: Aug 27, 2019 | 10:42 AM

చిత్తూరు జిల్లా వళ్లియప్పనగర్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సంతప్ కుమార్ అనే వ్యక్తి తనకు ఇంట్లో వాళ్లు వివాహం చేయలేదని సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. తాను ఇష్టపడ్డ అమ్మాయితో వివాహం చేయాలని లేకపోతే దూకేస్తానంటూ కాసేపు హడావుడి చేశాడు. కాసేపు ఇతడు చేసిన హంగామాతో ట్రాఫిక్ జామ్ అయింది. సెల్ టవర్ చుట్టూ వాహనాలు నిలిచిపోయాయి. చివరికి పోలీసులు వచ్చి అతడిని కిందికి దించారు. కాగా, సంపత్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన సంపత్ సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. పెళ్లి చేస్తే కాని కిందికి దిగను అంటూ అందరిని కంగారు పెట్టేశాడు. ఇది చూసిన కొందరు సెల్ కెమెరాల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us