విద్యార్థులకు మమతా సర్కారు గుడ్ న్యూస్.. స్మోర్ట్ ఫోన్లు కొనుగోలుకు ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందజేత.

|

Dec 24, 2020 | 8:59 AM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త తెలిపారు. కరోనా కారణంగా ఇంట్లో నుంచి ఆన్‌లైన్ క్లాసులు వింటోన్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు కొనుక్కోవడానికి...

విద్యార్థులకు మమతా సర్కారు గుడ్ న్యూస్.. స్మోర్ట్ ఫోన్లు కొనుగోలుకు ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందజేత.
Follow us on

Mamata govt give Rs 10,000 to buy smartphones: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త తెలిపారు. కరోనా కారణంగా ఇంట్లో నుంచి ఆన్‌లైన్ క్లాసులు వింటోన్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు కొనుక్కోవడానికి డబ్బులు అందజేయనున్నారు. స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు లేక ఆన్‌లైన్ క్లాసులు వినడానికి ఇబ్బంది పడుతోన్న విద్యార్థులకు అండగా నిలిచే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందించనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. దాదాపు 9.5 లక్షల మంది ఇంటర్ చదువుతోన్న విద్యార్థులకు ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా అందించనున్నారు. నిజానికి మమతా గతంలోనే ఈ హామీని ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలలు, మదర్సాలలో చదువుతున్న దాదాపు 9.5 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులకు సరిపడా ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ ఫోన్లను అందజేయడం కష్టంగా మారింది. దీంతో విద్యార్థుల ఖాతాలో నేరుగా డబ్బులు జమచేస్తామని, ఆ డబ్బుతో వాళ్లు స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేసుకోవచ్చని దీదీ చెప్పుకొచ్చారు.