Mamata Banerjee : భారత దేశానికి నాలుగు రాజధానులు ఉండాలన్న మమతా బెనర్జీ.. నేతాజీ 125వ జయంతి వేడుకల్లో దీదీ సంచలన వ్యాఖ్యలు

|

Jan 24, 2021 | 5:50 AM

భారత దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పార్లమెంటు సమావేశాలను కేవలం ఢిల్లీలోనే కాకుండా రొటేషన్‌ పద్ధతిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని కోరారు

Mamata Banerjee : భారత దేశానికి నాలుగు రాజధానులు ఉండాలన్న మమతా బెనర్జీ.. నేతాజీ 125వ జయంతి వేడుకల్లో దీదీ సంచలన వ్యాఖ్యలు
Follow us on

Mamata Banerjee : భారత దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పార్లమెంటు సమావేశాలను కేవలం ఢిల్లీలోనే కాకుండా రొటేషన్‌ పద్ధతిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని కోరారు. శనివారం కోల్‌కతాలో జరిగిన నేతాజీ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  నాలుగు రాజధానులను ఏర్పాటుచేసి రొటేషన్‌ పద్దతిలో అన్ని రాజధానుల్లోనూ పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నేతాజీ జయంతిని పరాక్రమ్‌ దివ్‌సగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. దీనిని దేశ్‌నాయక్‌ దివ్‌సగా ఎందుకు జరపడంలేదని ప్రశ్నించారు. నేతాజీని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.. దేశ్‌నాయక్‌ అని పిలిచేవారన్నారు.కాగా మమతా మాట్లాడుతున్న సమయంలో కొందరు జై శ్రీరాం అని నినాదాలు చేశారు. దాంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం