గులాబీ పార్టీలో ఆడియో టేప్ కలకలం

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2020 | 6:30 PM

తెలంగాణ పురపాలక పోరు నేపథ్యంలో.. విభేదాలు వీధి కెక్కుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ వరకు బీఫాం కోసం ఎదురుచూసిన నేతలు.. అవి దక్కకపోయే సరికి ఒకరిపై ఒకరు విమర్శలకు, ఆరోపణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బోడుప్పల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేతకు.. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు దుమారం రేపుతోంది. టికెట్ల విషయంలో మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్‌ చేసినట్టు రాపోలు రాములు అనే నేత ఆరోపణ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య టికెట్ల విషయంలో జరిగిన […]

గులాబీ పార్టీలో ఆడియో టేప్ కలకలం
Follow us on

తెలంగాణ పురపాలక పోరు నేపథ్యంలో.. విభేదాలు వీధి కెక్కుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ వరకు బీఫాం కోసం ఎదురుచూసిన నేతలు.. అవి దక్కకపోయే సరికి ఒకరిపై ఒకరు విమర్శలకు, ఆరోపణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బోడుప్పల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేతకు.. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు దుమారం రేపుతోంది.

టికెట్ల విషయంలో మంత్రి మల్లారెడ్డి డబ్బులు డిమాండ్‌ చేసినట్టు రాపోలు రాములు అనే నేత ఆరోపణ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య టికెట్ల విషయంలో జరిగిన సంభాషణ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడా ఆడియో టేపులు బయటపడడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, వాటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బయటపెడతానని రాములు అంటున్నారు. శాంపిల్‌గా మంత్రితో రాములు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేప్ మీడియాకు లీక్ చేశాడు రాములు. ఇప్పుడీ ఆడియో టేప్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే తనకు డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం లేదని, ఆ ఆడియో టేప్ మిమిక్రీది కావచ్చని మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. ఆయనకు మద్దతుగా మరో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ నిలబడ్డారు. మల్లారెడ్డి దగ్గరనే చాలా డబ్బుందని, దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాక మల్లారెడ్డి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారని అంటున్నారు నాగేందర్.

ఓవైపు.. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎవరికి వారు దూసుకుపోతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ కూడా అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొందరికి టికెట్ల దక్కకపోవడంతో రెబల్స్‌గా బరిలో నిలవగా.. మరికొందరు ఇలా టికెట్ల విషయంలో ఆరోపణలు చేస్తుండడం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేడికి అద్దం పడుతోంది.