మాలిలో సైనిక కుట్ర, అధ్యక్షుని రాజీనామా, నిర్బంధం

పశ్చిమ ఆఫ్రికా లోని మాలిలో అంతర్యుధ్ధం చెలరేగింది. అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా, ప్రధాని బెబూ సిప్ లను తిరుగుబాటు సైనికులు అదుపులోకి తీసుకున్నారు.

మాలిలో సైనిక కుట్ర, అధ్యక్షుని రాజీనామా, నిర్బంధం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 19, 2020 | 11:10 AM

పశ్చిమ ఆఫ్రికా లోని మాలిలో అంతర్యుధ్ధం చెలరేగింది. అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా, ప్రధాని బెబూ సిప్ లను తిరుగుబాటు సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్టు అధ్యక్షుడు ఇబ్రహీం ప్రకటించారు. ఆయన రాజీనామా సమాచారం తెలిసినవెంటనే రాజధాని బమాకాలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సైనికులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ అధ్యక్షుని భవనంవైపు దూసుకువెళ్లారు. తన ప్రభుత్వాన్ని, నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ఇబ్రహీం తెలిపారు. దేశంలో మరింత రక్తపాతం జరగకుండా చూసేందుకే పదవి నుంచి వైదొలగుతున్నానని అన్నారు.

కాగా.. మాలిలో జరిగిన పరిణామాలను, సైనిక కుట్రను అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఖండించాయి.