స్కూళ్ళు తెరిచినా పిల్లల్ని పంపం.. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన..

| Edited By:

May 12, 2020 | 11:25 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ముంబైలో మరణమృదంగం మోగిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ తమ పిల్లలను దాదాపు నెల వరకు

స్కూళ్ళు తెరిచినా పిల్లల్ని పంపం.. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన..
Follow us on

Parents in Mumbai will not send children to school: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ముంబైలో మరణమృదంగం మోగిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ తమ పిల్లలను దాదాపు నెల వరకు స్కూళ్లకు పంపేది లేదని ముంబయిలోని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘పేరెంట్ సర్కిల్’ అనే ఆన్‌లైన్ పేరెంటింగ్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించారు.

వివరాల్లోకెళితే.. తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 12వేల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారిలో 54 శాతం మంది ముంబయి నగరానికి చెందినవారే. వీరిలో దాదాపు 24 శాతం మంది లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత దాదాపు నెల రోజుల వరకు తమ పిల్లలను స్కూలు పంపేందుకు ఇష్టపడటం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు జూన్‌-జులై నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ, తమ పిల్లలను స్కూలుకు పంపే విషయమై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పిల్లలను స్కూళ్లకు పంపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేమని, ప్రభుత్వాలే ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యూహంతో మందుకు రావాలని సర్వేలో పాల్గొన్న ఓ విద్యార్థి తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఆరు నెలల వరకు తమ పిల్లలను బర్త్‌డే పార్టీలకు, ఆరు బయట ఆడుకునేందుకు, స్నేహితులను కలుసుకునేందుకు పంపబోమని 43 శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు. వాటితో పాటు సినిమాలకు, మాల్స్‌కు ఏడాదిపాటు వెళ్లబోమని తెలిపారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. 16న అండమాన్‌కి నైరుతి రుతుపవనాలు…

Also Read: తూర్పు ఆఫ్రికాలో దుమ్మురేపుతున్న.. ‘క‌రోనా వైర‌స్ హెయిర్ స్ట‌యిల్‌’..