మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 3314 మందికి పాజిటివ్, 66 మంది మృతి

|

Dec 27, 2020 | 8:01 PM

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ కట్టడికి ప్రభుత్వ చర్యలు ముమ్మరం చేసిన నిత్యం కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 3314 మందికి పాజిటివ్, 66 మంది మృతి
Follow us on

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ కట్టడికి ప్రభుత్వ చర్యలు ముమ్మరం చేసిన నిత్యం కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,314 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, 66 మంది మాయదారి రోగం బారినపడి మృత్యువాతపడినట్లు మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,19,550కు చేరుకుంది. అటు, మరణాల సంఖ్య 50 వేలు దాటింది. మరోవైపు, గత 24 గంటల్లో 2,124 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,09,948కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 59,214 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతూనే ఉంది. కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలపై అంక్షలు విధిస్తోంది.