రేపటి నుంచి వాణిజ్య కార్యకలాపాలు షురూ: థాకరే

| Edited By:

Apr 19, 2020 | 3:24 PM

కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. దీని నుంచి గట్టెక్కేందుకు సోమవారం నుంచి పరిమితంగా కొన్ని వాణిజ్య

రేపటి నుంచి వాణిజ్య కార్యకలాపాలు షురూ: థాకరే
Follow us on

కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. దీని నుంచి గట్టెక్కేందుకు సోమవారం నుంచి పరిమితంగా కొన్ని వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అదృష్టవశాత్తూ పలు జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. రాష్ట్రంలో ఇంతవరకూ 66,000 కరోనా పరీక్షలు జరిపించామని, వీటిలో నెగిటివ్ కేసులు 95 శాతం ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. 300 నుంచి 350 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్చ్ అయ్యారని తెలిపారు.

కాగా.. 52 మంది పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వారి ప్రాణాలను కాపాండేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన వలస కార్మికులకు ఆయన భరోసా ఇస్తూ, సంక్షోభం ముగిసి వారంతా ఎలాంటి భయాలు లేకుండా, సంతోషంగా తమతమ ఇళ్లకు చేరుకునేలా చూస్తామని అన్నారు. కేంద్రంతో కూడా చర్చలు సాగిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఒక పరిష్కారం లభిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మహారాష్ట్రలో క్రమంగా పనులు మొదలవుతాయని, వలస కూలీలు సైతం స్వరాష్ట్రానికి వచ్చి పనులు చేసుకుంటూ యథావిథిగా తమ జీవనం సాగిస్తారని థాకరే అన్నారు.

Also Read: అక్కడ తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. పరుగులు తీయనున్న వాహనాలు..