తైవాన్‌లో అర్ధరాత్రి ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు.. తీరంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం

|

Dec 11, 2020 | 7:57 AM

తైవాన్‌లో భూ ప్రకంపనలు కలవరం సృష్టించాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. ఉత్తర తైవాన్‌కు సమీపంలో ప్రకంపనలు వచ్చినట్లుగా అక్కడి జియాలాజికల్ అధికారులు వెల్లడించారు.

తైవాన్‌లో అర్ధరాత్రి ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదు.. తీరంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
Follow us on

తైవాన్‌లో భూ ప్రకంపనలు కలవరం సృష్టించాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. ఉత్తర తైవాన్‌కు సమీపంలో ప్రకంపనలు వచ్చినట్లుగా అక్కడి జియాలాజికల్ అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. తైవాన్ దేశంలోని ఈశాన్య తీరంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని సెంట్రల్ వెదర్ బ్యూరో తెలిపింది.

భూకంపం వల్ల తైపీ నగరంలోని ప్రభుత్వ సబ్ వే వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం లేదని, అది సాధారణంగా పనిచేసిందని తైపీ నగర అధికారులు వెల్లడించారు. 2016లో దక్షిణ తైవాన్ లో సంభవించిన భూకంపంలో వందమందికి పైగా మరణించారు. 1999లో తైవాన్ లో సంభవించిన 7.3 భూకంపం తీవ్రత కారణంగా 2వేలమంది ప్రాణాలు కోల్పోయారు. తైవాన్ దేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. భూమి కంపించడంతో తైపీ నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.