నీరవ్‌కు మూడోసారీ ‘నో’ బెయిల్

| Edited By:

Apr 26, 2019 | 5:09 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి లండన్ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఇప్పటికీ మూడుసార్లు ఆయన బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. ఇక ఇదే కేసులో తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసిన జడ్జి, ఫైనల్ హియరింగ్‌ను 30న చేపడుతామని తెలిపారు. కాగా పీఎన్బీ స్కాం కేసులో మార్చి 19న నీరవ్‌ను అరెస్ట్ చేశారు లండన్ […]

నీరవ్‌కు మూడోసారీ ‘నో’ బెయిల్
Follow us on

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి లండన్ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఇప్పటికీ మూడుసార్లు ఆయన బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. ఇక ఇదే కేసులో తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసిన జడ్జి, ఫైనల్ హియరింగ్‌ను 30న చేపడుతామని తెలిపారు.

కాగా పీఎన్బీ స్కాం కేసులో మార్చి 19న నీరవ్‌ను అరెస్ట్ చేశారు లండన్ పోలీసులు. దీనిపై విచారణ సందర్భంగా భారత్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. నీరవ్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, దేశం విడిచివెళ్లొచ్చని తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నీరవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు మళ్లీ నో చెప్పింది.