బ్రేకింగ్: లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించిన ఏపీ..

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కాగా.. లాక్‌డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేందం నిర్ణయం తీసుకోగా..

బ్రేకింగ్: లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించిన ఏపీ..

Updated on: May 18, 2020 | 10:24 AM

Lockdown In AP: కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కాగా.. లాక్‌డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేందం నిర్ణయం తీసుకోగా.. రాష్ట్రంలోనూ మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించింది. అటు ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

మరోవైపు.. తాజాగా తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం ప్రకటించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us