క‌రోనా వైర‌స్ జోన్ల‌ను ఎలా వ‌ర్గీక‌రిస్తారు..

|

May 18, 2020 | 2:13 PM

క‌రోనా వైర‌స్ ప్ర‌భావిత‌ ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ గా వర్గీకరించేటప్పుడు రాష్ట్రాలు, యుటిలు అనుసరించాల్సిన మార్గ‌నిర్దేశ‌కాల జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుద‌ల చేసింది. యాక్టివ్ కోవిడ్-19 కేసులు, కేసులు రెట్టింపు, మరణాల రేటు.. లక్ష జనాభాకు కేసులు వంటి పెరామీట‌ర్స్ ని బ‌ట్టి జోన్స్ డివైడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది కరోనావైరస్ కంటైన్మెంట్, బఫర్ జోన్లలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చైన్ ను తెగ్గొట్టడానికి కూడా ప్రత్యేక‌ మార్గదర్శకాలు జారీ […]

క‌రోనా వైర‌స్ జోన్ల‌ను ఎలా వ‌ర్గీక‌రిస్తారు..
Follow us on

క‌రోనా వైర‌స్ ప్ర‌భావిత‌ ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ గా వర్గీకరించేటప్పుడు రాష్ట్రాలు, యుటిలు అనుసరించాల్సిన మార్గ‌నిర్దేశ‌కాల జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుద‌ల చేసింది. యాక్టివ్ కోవిడ్-19 కేసులు, కేసులు రెట్టింపు, మరణాల రేటు.. లక్ష జనాభాకు కేసులు వంటి పెరామీట‌ర్స్ ని బ‌ట్టి జోన్స్ డివైడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది కరోనావైరస్ కంటైన్మెంట్, బఫర్ జోన్లలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చైన్ ను తెగ్గొట్టడానికి కూడా ప్రత్యేక‌ మార్గదర్శకాలు జారీ చేయ‌బడ్డాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ జోన్ల‌కు సంబంధించి వివరాలు వెల్ల‌డించారు. క‌రోనావైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త‌ను బ‌ట్టి జిల్లాలను లేదా మునిసిపల్ కార్పొరేషన్లను… రాష్ట్ర ప్ర‌భుత్వాలు హాట్‌స్పాట్‌లు, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా వర్గీకరించవచ్చు. అదే విధంగా వీలును బ‌ట్టి స‌బ్ డివిజన్, వార్డ్ లేదా మరేదైనా తగిన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌ను జోన్లుగా విభ‌జించ‌వ‌చ్చు.

జోన్ల‌ను ఎలా వ‌ర్గీక‌రిస్తారు..

  • గ్రీన్ జోన్స్ : ఈ రోజు వరకు అస్స‌లు కేసులు లేని లేదా గత 21 రోజులలో ధృవీకరించబడిన కేసులు లేని ప్రాంతాలను గ్రీన్ జోన్స్ గా ప‌రిగ‌ణిస్తారు.
  • రెడ్ జోన్స్ :  ప్ర‌స్తుతం ఉన్న‌ కేసుల సంఖ్య, ధృవీకరించబడిన కేసుల రెట్టింపు రేటు, పరీక్షల పరిధి, స‌ద‌రు ప్రాంతాల నుంచి వ‌చ్చిన కేసులు ఆధారంగా రెడ్ జోన్లుగా ఎంపిక చేస్తారు
  • ఆరెంజ్ జోన్స్ : రెడ్ లేదా గ్రీన్ జోన్స్ గా నిర్వచించబడని ప్రాంతాల‌ను ఆరెంజ్ జోన్లుగా వర్గీకరిస్తారు

కంటైన్మెంట్ జోన్
క‌రోనా పాజిటివ్ కేసులను గుర్తించిన నిర్దిష్ట ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ అని పిలుస్తారు.

బ‌ఫ‌ర్ జోన్స్
క‌రోనా వైర‌స్ కేసులు కొత్త‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న ప్రాంతాల‌ను బ‌ఫ‌ర్ జోన్లుగా ప‌రిగ‌ణిస్తారు.