ఈ చిత్రం చూశారా..!

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 7:01 PM

తెలంగాణలోని  ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడు..మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిపోయింది. పొద్దంతా ఉపవాసం ఉన్న భక్తులు రాత్రికి అక్కడే జాగారం చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకర సన్నివేశం మీడియా కెమెరా కళ్లకు చిక్కింది. 

ఈ చిత్రం చూశారా..!
Follow us on

తెలంగాణలోని  ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడు..మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిపోయింది. పొద్దంతా ఉపవాసం ఉన్న భక్తులు రాత్రికి అక్కడే జాగారం చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకర సన్నివేశం మీడియా కెమెరా కళ్లకు చిక్కింది.  రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర్లో ఉన్న ఓ సత్రం ముందు ఓ పోలీసు వెహికల్ ఆగి ఉంది. అయితే అక్కడికి వచ్చిన భక్తులు సదరు వెహికల్‌పై దుప్పట్లు, బట్టలు ఆరేశారు. ఇంకేముంది ఆ క్లిక్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది మహాశివరాత్రికి తెలంగాణ ప్రభుత్వం వేములవాడకు హెలికాప్టర్ సేవలన ప్రారంభించింది.  టీఎస్ స్టేట్ టూరిజం ఆర్గనైజన్.. తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ సౌజన్యంతో ఈ సేవలను అందిస్తోంది. ఈ నెల 23వ తేదీ వరకు హెలికాప్టర్‌ సేవలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి

హెలికాప్టర్ సేవలను మూడు రకాల ప్యాకేజీలుగా విభజించారు.

  •  ప్యాకేజీ-1లో భాగంగా వేములవాల నుంచి వ్యూపాయింట్‌కు 7 నిమిషాల రైడ్‌.  టికెట్‌ ధర రూ.3 వేలు.
  • ప్యాకేజీ-2లో వేములవాడ మిడ్‌మానేరు చుట్టపక్కల ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేసేందుకు టికెట్ ధర రూ.5,500. 16 నిమిషాల రైడ్. అయితే ఈ  ఫ్యాకేజ్ కోసం కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలన్న నిబంధన ఉంది.
  • ప్యాకేజీ-3లో హైదరాబాద్‌ నుంచి వేములవాడకు.. తిరిగి హైదరాబాద్‌కు టికెట్‌ ధర రూ. 30 వేలు. కనీసం ఐదుగురు వ్యక్తులు ఉండాలి.